![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-8 లో పదమూడో వారం నామినేషన్లలో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ముఖ్యంగా కన్నడ బ్యాచ్ కి గౌతమ్ కి మధ్య తీవ్రంగా గొడవలు జరిగాయి. పృథ్వీ చేసిన తప్పుకి వీకెండ్ లో వచ్చిన నాగార్జున గౌతమ్ దే తప్పంటూ చెప్పగా.. నిన్నటి నామినేషన్లో గౌతమ్ పై రెచ్చిపోయాడు పృథ్వీ.
గౌతమ్ ని నిఖిల్ నామినేషన్ చేశాడు. ఫ్లిప్ అవుతున్నావంటూ రీజన్ చెప్పగా.. గేమ్ లో అలా జరిగిందని నిఖిల్ చెప్పుకొచ్చాడు. వాటర్ ట్యాంక్ టాస్కులో మీద మీదకి వచ్చిందెవరు.. బీప్‌లో మాట్లాడిందెవరు.. అంటూ నిఖిల్ ఫైర్ అయ్యాడు. దీనికి నేను మాట్లాడకుండా మాట్లాడా అని నువ్వు ప్రొజెక్ట్ చేసినవ్ మచ్చా.. అంటూ గౌతమ్ అన్నాడు. దీంతో నేను చేయలేదు.. చేయాలంటే నామినేషన్‌లోనే చేసేవాడిని.. అని నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. అయినా నువ్వు చేసినవ్.. నన్ను చేయని తప్పుకి నిందించారు.. అబాండాలు వేసినవ్.. నేను అనని పదాన్ని అన్నావని నాపై అబాండం వేశారు.. అంటూ గౌతమ్ అన్నాడు. దాన్ని హౌస్‌తో పాటు ఆడియన్స్ కూడా ఎవరూ ఒప్పుకోలేదు.. అంటూ నిఖిల్ అన్నాడు. దీంతో నీకు బయటికెళ్లి చూపిస్తా మచ్చా నేను ఆ పదం అని ఉంటే నేను కంఠం కోసుకొని చచ్చిపోతా నీ కంటి ముందు.. తల్లి ప్రమాణంగా నేను అనలేదంటూ గౌతమ్ అన్నాడు. తల్లి ప్రమాణంగా నేను అనలేదు.. అని గౌతమ్ అంటే అదే తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా నేను అలా పోట్రే చేయలేదు.. అంటూ నిఖిల్ అన్నాడు. వీళ్ల మధ్య డిస్కషన్ నడుస్తుండగా తేజ మాట్లాడటానికి ట్రై చేశాడు.
తేజ నీ డిఫెన్స్ లాయరా అంటూ గౌతమ్‌ని రెచ్చగొట్టాడు పృథ్వీ. దీంతో వద్దురా నువ్వు కూర్చోమంటూ తేజతో గౌతమ్ చెప్పాడు. అయినా సరే మాటిమాటికి వాడు నీ డిఫెన్స్ లాయరా అంటూ పృథ్వీ రెచ్చగొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు డిస్కషన్ నడించింది. నేను నిఖిల్‌ని నామినేట్ చేస్తే నువ్వెందుకు మధ్యలో వస్తావంటూ గౌతమ్ అడిగాడు. అయిన సరే పృథ్వీ నేను మాట్లాడతా ఏం చేస్తావంటూ గౌతమ్ మీదకి వెళ్లాడు పృథ్వీ. అలా ఇద్దరి మధ్య కాసేపు హీటింగ్ డిస్కషన్ జరిగంది. ఇక జైలు నామినేషన్‌లో నాకు పృథ్వీకి గొడవ అయితే నువ్వు నా మీద రెయిజ్ అయ్యావ్.. ఎందుకంటూ గౌతమ్ అడిగాడు. దీనికి నా వాక్కు నా హక్కు.. మనోడు ఏం మాట్లాడతాడో తియ్ చూద్దాం అన్నానంటూ నిఖిల్ అన్నాడు.
![]() |
![]() |